2021-22లో భార‌త్ 7.4శాతం వృద్ధి సాధిస్తుంద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంతదాస్‌ వెల్ల‌డించారు. ఈరోజు ఉద‌యం 10గంట‌ల‌కు ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ ప‌లు కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో విధులు నిర్వ‌ర్తిస్తున్న సిబ్బందికి ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. బ్యాంకుల ప‌నితీరును మెరుగుప‌ర్చ‌డానికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఆర్థిక వ్య‌వ‌స్థ మెరుగుప‌ర్చ‌డానికి ఆర్బీఐ అనేక చ‌ర్య‌లు తీసుకుంద‌ని తెలిపారు. క‌రోనా సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో భార‌త్ 1.9శాతం సానుకూల వృద్ధిని సాధిస్తుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చెప్పారు. మ‌హాత్మాగాంధీ చెప్పిన మాట‌ల‌ను గుర్తు చేశారు. *మరణం మధ్యలో జీవితం కొనసాగుతోంది. అసత్య సత్యం మధ్యలో కొనసాగుతోంది. చీకటి మధ్యలో వెలుగు రేఖ వ‌స్తుంది* అని గాంధీని గుర్తు చేసుకున్నారు. ప్ర‌స్తుతం మాన‌వాళి అతిపెద్ద స‌వాలును ఎదుర్కోంద‌ని, ఈ చీకటిని త‌రిమికొట్టేందుకు మ‌నం కంక‌ణ‌బ‌ద్ధులం కావాల‌ని, ఆ దిశ‌గా క‌ద‌లాల‌ని ఆయ‌న సూచించారు. త్వ‌ర‌లోనే ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతాయ‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: