కరోనా పరిస్థితుల నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోన్న నేపథ్యంలో ఈ విషయాలపై ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్‌ మాట్లాడుతూ కీలక విషయాలు తెలిపారు. ఆర్థిక వ్యవస్థపై సమీక్షిస్తున్నాం... పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  అతిపెద్ద మహమ్మారిని మానవాళి ఎదుర్కొంటోందన్నా యన.. కరోనాపై యుద్ధం చేస్తున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 1930 నాటి ఆర్థిక సంక్షోభాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం... ఈ సమయంలోనూ బ్యాంకుల సేవలు ప్రశంసనీయం అన్నారు. 

 

ప్రపంచ మార్కెట్లన్నీ ఒడుదొడుకుల్లో ఉన్నాయి. ఖరీఫ్‌లో 36 శాతం ధాన్యం ఉత్పత్తి పెరిగిందన్న ఆయన.. భారత్‌ జీడీపీ 1.9శాతంగా ఐఎంఎఫ్‌ అంచనావేసిందని.. జీ-20 దేశాల్లో భారత్‌ జీడీపీనే అధికంగా ఉందన్నారు.. జీడీపీలో 3.2శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చాం. బ్యాంకుల కార్యకలాపాలు సాఫీగాసాగుతున్నాయని స్పష్టం చేశారు. కరోనా వైరస్ పరిస్థితిని చాలా దగ్గరగా పరిశీలిస్తున్నామనీ  ఆర్థిక వ్యవస్థను ఎప్పటికపుడు సమీక్షిస్తున్నామని శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా  24 గంటలూ  శ్రమిస్తూ విశేష సేవలందించిన  ఆర్‌బీఐ ఉద్యోగులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.   

 

ఇదే చివరి సమావేశం కాదని, ఈ ప్రక్రియ ఇకముందు కూడా కొనసాగుతుందని, కరోనా వైరస్ కు సంబంధించిన ప్రతీ అంశాన్ని పరిశిలీస్తూ, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా  అధిగమించేందుకు ఆర్‌బీఐ  అండగా వుంటుందని ఆయన  భరోసా ఇచ్చారు.  కరోనా ప్రభావం లేకుండా చూడడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం కరోనా వైరస్ తో అల్లకల్లోలంగా ఉందని.. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో భారత్ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.. మరణాల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.  ఈ లెక్కన మన ఆర్థిక వద్ది రేటు బేషుగ్గానే ఉందని శక్తికాంతదాస్‌  అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: