ఏపీలో క‌రోనా వైర‌స్ కోర‌లు చాస్తోంది. ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా క‌రోనా మాత్రం ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాప్తి చెందుతూనే వ‌స్తోంది. తాజాగా శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు రిలీజ్ అయిన బులిటెన్ ప్ర‌కారం చూస్తే ఏపీలో మ‌రో 38 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. ఈ కొత్త కేసుల‌ను కూడా క‌లుపుకుంటే ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కేసులు 572కు చేరుకున్నాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో క‌రోనా సోకి మొత్తం 14 మంది మృతి చెందారు. ఇక క‌రోనా సోకిన వారిలో 35 మంది కోలుకున్నారు. 

 

తాజాగా న‌మోదు అయిన కొత్త కేసుల్లో ఏకంగా క‌ర్నూలు జిల్లాలో 13 కేసులు ఉన్నాయి. అనంత‌పురం, చిత్తూరు జిల్లాల్లో 5 కేసులు, నెల్లూరు జిల్లాలో ఆరు న‌మోదు అయ్యాయి. ఏదేమైనా ప్ర‌భుత్వం ఇన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా కూడా క‌రోనా వైర‌స్ ఈ విధంగా చాప‌కింద నీరులా వ్యాప్తి చెంద‌డం ఆందోళ‌న క‌లిగించే అంశ‌మే అని చెప్పాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: