ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా క‌ట్ట‌డికి జ‌గ‌న్ స‌ర్కార్ ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. ప్ర‌జ‌లంద‌రికీ మాస్క్‌ల పంపిణీ, క్వారంటైన్ కేంద్రాల నుంచి ఇంటికి పంపే స‌మ‌యంలో పేద‌ల‌కు రెండు వేల రూపాయ‌ల ఆర్థిక‌సాయం అందిస్తున్నది. దీంతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌లువురి మ‌న్న‌న‌లు అందుకుం టున్నాడు. తాజాగా బ్రిటన్‌కు చెందిన ఓ వ్య‌క్తి సీఎం జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు.  కరోనా క్వారంటైన్ కేంద్రాల్లో సౌకర్యాలు అద్భుతంగా ఉ న్నాయం టూ చెప్పుకొచ్చాడు. క్వారంటైన్ ముగిసిన తర్వాత భారత్ నుంచి యూకే వెళ్లడానికి అనుమతి వచ్చిన తర్వాత కల్లీ క్లైవ్ బ్రయాంట్ అధికారులను ప్రశంసిస్తూ ఓ లేఖ రాశాడు.

 

బ్రిటన్‌లోని వేల్స్ రాష్ట్రానికి చెందిన కల్లీ క్లైవ్ బ్రయాంట్ తిరుపతిలో శ్రీ పద్మావతి నిలయం వద్ద ఏర్పాటు చేసిన క్వారంటైన్ పూర్తి చేసుకున్నాడు. దీంతో అక్కడ అధికారులు, వైద్య సిబ్బంది, బాగా చూసుకున్నారని.. క్వారంటైన్ సెంటర్‌లో టిఫిన్, భోజనం, డిన్నర్ అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చాడు. క్వారంటైన్‌ కేంద్రాల్లో గాలి, వెలుతురు వచ్చేలా.. విశాలమైన బెడ్‌లు ఉన్నాయన్నారు. పరిసరాలు అన్ని చాలా పరిశుభ్రంగా ఉన్నాయని తెలిపారు. తిరుపతి ప్రకృతి కనువిందు చేసిందని తెలిపాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: