అమెరికాలో క‌రోనా వైర‌స్ మార‌ణ‌హోమం సృష్టిస్తోంది. తాజాగా.. గ‌త గంట‌ల్లోనే రికార్డు స్థాయిలో ఏకంగా 4,591 మంది మ‌ర‌ణించారు. దీంతో అమెరికాలో భ‌యాన‌క ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కోవిడ్ -19 మరణాలు అమెరికాలో సంభవిస్తున్నాయి.  ఇప్ప‌టివ‌ర‌కు 6,69,378కుపైగా కరోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక 34,103మందికిపైగా మృతి చెందారు. అమెరికా ఇప్పుడు కొవిడ్‌-19కు హాట్‌స్పాట్‌గా మారింది. ప్ర‌పంచంలో అత్య‌ధిక పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు యూఎస్‌లోనే ఎక్కువ‌గా న‌మోదు అవుతున్నాయి.

 

అక్క‌డి ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూ పూట‌గ‌డుపుతున్నారు. ఇట‌లీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, ఇరాన్ త‌దిత‌ర దేశాల్లోనూ క‌రోనా వైర‌స్ బీభ‌త్సం సృష్టిస్తోంది. ఇక మ‌రొక విష‌యం ఏమిటంటే.. మొత్తం మ‌ర‌ణాలు, పాజిటివ్ కేసుల్లో యూర‌ప్‌, అమెరికాలోనే 50శాతానికిపైగ న‌మోదు అవుతున్నాయి. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నా.. మ‌ర‌ణాలు మాత్రం ఆగ‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వుతున్నారు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 146,872 మందికి పైగా మరణించారు. పాజిటివ్ కేసుల సంఖ్య 2,183,908 కు చేరుకుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: