తెలుగు సినిమాల్లో న‌టించి.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ స‌ర‌స‌న న‌టించే ల‌క్కీ ఛాన్స్ మిస్ అయిన అనీషా అంబ్రోస్ పేరు మ‌న‌వాళ్ల‌కు ఎప్ప‌ట‌కీ గుర్తుంటుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా కేఎస్‌. ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాకు హీరోయిన్ కోసం అడిష‌న్స్ నిర్వ‌హించారు. ఇందులో అనీషా అంబ్రోస్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ క్ర‌మంలోనే ఆమె గోపాల గోపాల సినిమాలో ఓ క్యారెక్ట‌ర్ కూడా చేసింది. అయితే స‌డెన్‌గా ఆమె ప‌వ‌న్ ప‌క్క‌న సెట్ కాద‌ని త‌ప్పించి కాజ‌ల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు.

 

అనీషా అచ్చ తెలుగు అమ్మాయి. ఆమె వైజాగ్‌కు చెందిన అమ్మాయి. 2013లో అనీషా అలియాస్ జానకి సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యింది. ఇక ప్ర‌స్తుతం ఆమె గ‌ర్భ‌వ‌తి. త‌న భ‌ర్త గుణ జ‌క్కా ఆమె క‌డుపును ముద్దాడుతోన్న ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఇది వైర‌ల్ అవుతోంది. ఆమె భ‌ర్త గుణ జ‌క్కాతో ఆమె దిగిన ఫొటోను ఆమె స్నేహితురాలు అయిన మ‌రో హీరోయిన్ తేజ‌స్విని మాదివాడ షేర్ చేశారు. ఇక అనీషా భ‌ర్త గుణ జేఎంఆర్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ ఎగ్జిగ్యూటివ్ డైరెక్ట‌ర్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: