దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా గురించిన చర్చలే నడుస్తున్నాయి.  గత నెల నుంచి ప్రారంభమైన ఈ దిక్కుమాలిన కరోనా వ్యాప్తి రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. తెలంగాణలో కరోనా కరాళనృత్యం కొనసాగుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెగుతోంది. ఇప్పటి వరకు తెలంగాణలో 700 పాజిటీవ్ కేసులు నమోదుకాగా 18 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు వైరస్  బారి నుంచి కోలుకుని 186 మంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే  ఇప్పటి వరకూ సేఫ్‌ జోన్‌లో ఉన్న మంచిర్యాల జిల్లాలో నేడు తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.

 

చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఈ మహిళకు అనారోగ్యం చేయడంతో ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. ఈనెల 14వ తేదీన ఆమె హైదరాబాద్‌లోనే చనిపోయింది. అప్పటికే పంపిన శాంపిల్స్‌లో ఆమెకు పాజిటివ్‌ అని తేలడంతో ముత్తరావుపల్లిలో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు.  ఇదిలా ఉంటే.. చనిపోయిన మహిళతో ఊరిలో వారికి ఉన్న అనుబంధం, కలిసిన వారి వివరాలు సేకరిస్తున్నారు.

 

మొదటి కేసు నమోదు కావడంతో మంచిర్యాల చుట్టు పక్కల ప్రాతాలపై కూడా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. తాజాగా కుమ్రంభీం జిల్లా జైనూరులో అధికారులు మరొక కరోనా పాజిటీవ్ కేసు నిర్ధారించారు. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్‌లో ఉన్న మరొకరికి పాజిటీవ్ వచ్చింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: