ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 స్వైర విహారం చేస్తోంది. కంటికి క‌న‌పించ‌ని శ‌త్రువును క‌ట్ట‌డి చేయ‌లేక ప్ర‌భుత్వాలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి.  కరోనా క‌ర‌ల్లో చిక్కుకొని దేశాల‌న్నీ విల‌విలాడుతున్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 21 ల క్షలు దాటగా, మరణాల సంఖ్య 1.45 లక్షలు దాటింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 5,47,207 మంది కరోనా బారిన పడిన కోలుకున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు (గురువారం) 1,515 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మొత్తంగా 21,82,823 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. అలాగే కరోనాతో నేడు 81 మంది చనిపోయారు.  ప్రపంచవ్యాప్తంగా 1,45,551 లక్షల మంది కరోనాతో మరణించారు.

 

మ‌రోప‌క్క అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. కోవిడ్ దాటికి అగ్ర‌రాజ్యం చివురుటాకులా వ‌ణికిపోతోంది. గ‌డిచిన  24 గంటల్లో 3 వేల కేసులు నమోదు అయ్యాయి. న్యూయార్క్‌లోనే ఎక్కువగా మరణాలు సంభవించాయి. పదివేలకుపైగా కరోనా బారిన పడి మృతిచెందారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం న్యూయార్క్‌లో లాక్‌డౌన్‌ను పొడిగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: