దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలియనిది కాదు ఈ కేసులలు దాదాపుగా మర్కజ్ నిజాముద్దీన్ జమాత్ మతపరమైన ప్రార్ధనల పుణ్యమే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . దేశంలో లాక్ డౌన్ విధించక మునుపు ఢిల్లీ లో తబ్లీఘి ప్రార్ధనల సమావేశం కోసం దేశ నలుమూల నుండి మరియు ఇతర దేశాలనుండి కూడా వచ్చిన సంగతి తెలిసిందే . అయితే కరోనా ఉన్న వ్యక్తులనుండి ఇతరవ్యక్తులకు సోకడం జరిగింది.

 

 

అయితే వీరంతా తమ తమ ప్రాంతాలకు వెళ్లి మిగతా ప్రాంతాల వారికీ కూడా వ్యాపింప జేయడం జరిగింది అయితే నిబంధనలకు విరుద్దంగా తబ్లీఘీ జమాత్‌ సమవేశాలను ఏర్పాటు చేయడమే కాకుండా.. విదేశీయులను కూడా ఈ సమావేశాల్లో పాల్గొనేలా చేయడంతో పోలీస్ యంత్రాంగం ఇప్పటికే మూలాన మహమ్మద్ సాద్ పై ఎఫ్ఐఆర్  నమోదు చేశారు . తాజాగా ఈడీ కూడా రంగ ప్రవేశం చేసింది. గత మర్చి నెలలో తబ్లీఘి జమాత్ చీఫ్ మౌలానా మహమ్మద్ సాద్ తబ్లీఘీ జమాత్ ఆరు అంతస్తుల బిల్డింగ్ లో దేశప్రజలతో పాటుగా విదేశాలనుండి వచ్చిన వారితో కలసి ప్రార్ధనలు చేశారు , తద్వారా వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారకులయ్యారని బావిస్తూ మౌలానా మహమ్మద్ సాద్ పై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు 

మరింత సమాచారం తెలుసుకోండి: