కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితులను చూసి గర్భిణులు భీతిల్లుతున్నారు.. తమకు పుట్టబోయే పిల్లలు ఎలాంటి ప్రపంచంలో జీవించాల్సి వస్తుందోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అలాంటి మహిళలందరి కోసం.. కాబోయే ఆ తల్లుల కోసం మనందరం ఆదేవుడిని ప్రార్థిద్దామని అంటున్నారు పోప్ ఫ్రాన్సిస్. ఈ మేరకు తాజాగా.. ఆయన ట్విట్టర్లో ఒక సందేశం పోస్ట్ చేశారు. వారందరికీ దేవుడు ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇవ్వాలని కోరుకుందామని ట్వీట్ చేశారు. వారికి పుట్టబోయే పిల్లలు దేవుడికి నచ్చిన మంచి ప్రపంచంలో జీవించాలని కోరకుకుందాం.. అంటూ ఆ సందేశంలో పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు.
ఆయన చేసిన ట్వీట్‌కు ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోంది. తల్లిదండ్రుల కోసం, ముఖ్యంగా వారి చిన్నచిన్న పిల్లల కోసం అందరం ప్రార్థించాలని, వారందరూ దేవుడి ప్రేమలో జీవించాలని కోరకుందామంటూ పలువుర ట్వీట్ చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి మానవాళి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ ఆ దేవుడిని ప్రార్థించాలని కోరుతున్నారు. కరోనా మహమ్మారి నుంచి తమను కాపాడాలని దేవుడిని వేడుకుంటున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
Let us #PrayTogether for expectant women who will become mothers and who ask themselves: "What type of world will my child live in?". May the Lord give them the courage and confidence that it will certainly be a different world, but also one which the Lord will love tremendously.
— Pope Francis (@Pontifex) April 17, 2020