ఈ రోజు భార‌త వైమానిక ద‌ళానికి చెందిన ఓ హెలీకాఫ్ట‌ర్ ఈ రోజు అనుకోకుండా పొలాల్లా ల్యాండ్ అవ్వాల్సి వ‌చ్చింది. వైమానిక‌ ద‌ళానికి చెందిన ఈ హెలీకాఫ్ట‌ర్ పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలో ఒక పొలంలో ముందు జాగ్రత్తగా దిగింది. దాని నియంత్రణ ప్యానెల్‌లలో హెచ్చరికలు జారీ అవ్వ‌డంతో అత్య‌వ‌స‌రంగా దీనిని ల్యాండ్ చేశారు. ప‌ఠాన్ కోట్ ఎయిర్ బేస్ నుంచి ఈ హెలీ కాఫ్ట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇక భార‌త‌ వైమానిక దళం హెలికాప్టర్‌ను తనిఖీ చేసి, ఆపై దానిని తిరిగి తన స్థావరానికి తీసుకువెళుతుంది. ఈ సంఘ‌ట‌న‌లో జ‌వాన్ల‌తో పాటు ఫైలెట్లు అంద‌రూ సుర‌క్షితంగా ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: