దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్‌తో వ్య‌వ‌సాయ‌రంగంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతోంది. సుమారు 25రోజులుగా లాక్‌డౌన్‌కొన‌సాగుతుండ‌డంతో ఎక్క‌డిప‌నులు అక్క‌డే నిలిచిపోయాయి. ర‌బీ పంట‌లు పూర్తిస్థాయిలో దెబ్బ‌తింటున్నాయి. చేతికందే ద‌శ‌లో పంట నాశ‌నం అవుతోంది. ఈ క్ర‌మంలో రైతులు దిక్కుతోచ‌ని స్థితిప‌డిపోతున్నారు. తీవ్ర మాన‌సిన వేద‌న‌కు గుర‌వుతున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. నిజానికి.. గ్రామాల్లో వ్య‌వ‌సాయ ప‌నుల‌కు ప్ర‌భుత్వాలు కొంత‌మేర‌కు స‌డ‌లింపులు ఇచ్చినా.. కూలీలు ప‌నుల‌కు రావ‌డం లేదు. దీంతో ప‌త్తి, మిర్చి, ట‌మాటాలు ఏర‌డానికి కూలీలు దొర‌క‌డం లేదు. దీంతో ప‌త్తిని, మిర్చిని, టమాటాల‌ను తోట‌ల‌పైనే వ‌దిలేస్తున్నారు. ప‌త్తి చెల‌క‌లోనే రాలిపోతోంది. ఎండ‌ల‌కు మిర్చి తోట‌ల‌పైనే పాడైపోతోంది. ఇక టమాటాలు పుచ్చిపోతున్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ధానంగా ట‌మాటా తోట‌ల రైతులు క‌న్నీటిప‌ర్యంత‌మ‌వుతున్నారు. కూలీలు దొర‌క్క‌, మార్కెట్‌కు తీసుకెళ్దామంటే ర‌వాణా సౌక‌ర్యం లేక తోట‌ల్లోనే పుచ్చిపోతున్న ట‌మాటాల‌ను చూసి రైతులు బోరున విల‌పిస్తున్నారు. 

 

శ‌త‌ర్‌పూర్‌కు చెందిన రైతులు మాట్లాడుతూ.. గ‌త రెండు వారాల్లోనే త‌మ‌కు సుమారు 50-60వేల రూపాయ‌ల న‌ష్టం వ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని కోరుతున్నారు. నిజానికి.. ఇదే విష‌య‌మై ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి లేఖ కూడా రాశారు. వ్య‌వ‌సాయం, దాని ఆధారిత రంగాలు తీవ్రంగా దెబ్బ‌తింటున్నాయని, ఆయా రంగాల‌పై ఆధార‌ప‌డి బ‌తుకుతున్న వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని పేర్కొన్నారు. వ్య‌వ‌సాయం, దాని అనుబంధ రంగాల కార్య‌క‌లాపాల‌కు లాక్‌డౌన్ కాలంలో స‌డ‌లింపులు ఇవ్వాల‌ని కోరారు. రెండో ద‌శ లాక్‌డౌన మార్గ‌ద‌ర్శ‌కాలలో ఈ రంగాల కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తి ఇచ్చారు. అయితే..అప్ప‌టికే పంట‌ల‌కు జర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింద‌ని, రైతులను ఆదుకోవాల‌ని ప‌లువురు విశ్లేష‌కులు కోరుతున్నారు. దాదాపుగా దేశంలోని అన్నిరాష్ట్రాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉంద‌ని, కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు రైతుల కోసం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. లేనిప‌క్షంలో తీవ్ర సంక్షోభం ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: