తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై శుక్ర‌వారం మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రులు ఈట‌ల రాజేంద‌ర్‌, శ్రీ‌నివాస్‌గౌడ్ వీడియో కాన్ఫ్‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ మీడియో కాన్ఫ‌రెన్స్‌లో జీహెచ్ఎంసీతోస‌హా రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల మేయర్లు, పురపాలక చైర్మన్లు, కమిషనర్లు, అదనపు కలెక్టర్లు, ఏసీపీల‌తో పాల్గొన్నారు. అలాగే.. ఈ సమీక్ష సమావేశంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన‌ కంటైన్మెంట్‌ జోన్లలో క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటున్న‌, మున్ముందు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు.

 

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీల‌లో మెరుగైన పారిశుధ్యం, ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన స‌రుకుల అంద‌జేత‌, వ‌ల‌స కార్మికుల సంక్షేమంపై ప్ర‌ధానంగా దృష్టి సారించాల‌ని అన్నారు. కాగా, గురువారం నాడు హైద‌రాబాద్‌లోని కంటైన్మెంట్ జోన్ల‌లో మంత్రి కేటీఆర్ ఆక‌స్మికంగా ప‌ర్య‌టించి, స్థానిక ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వారు ఇబ్బందుల‌ను తెలుసుకున్నారు. ప్ర‌తీ ఒక్క‌రు సామాజిక దూరం పాటించాల‌ని సూచించారు. ఆ ప‌ర్య‌ట‌న‌లో క్షేత్ర‌స్థాయి ప‌రిశీలించిన అంశాల‌ను ఈ స‌మావేశంలో ఆయ‌న ప్ర‌స్తావిస్తూ మ‌రింత క‌ట్టుదిట్టంగా లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను అమ‌లుచేయాల‌ని సూచించిన‌ట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: