ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతోమందిని బ‌లితీసుకుంటోన్న కోవిడ్ 19పై పోరాటం చేసేందుకు భార‌త‌దేశం పెద్ద యుద్ధ‌మే చేస్తోంద‌ని చెప్పాలి. ఈ ప్ర‌పంచ మ‌హ‌మ్మారిపై పోరాటానికి రెడీ అయ్యేందుకు భార‌తీయులు అంద‌రిని సంఘ‌టితం చేయ‌డంలో మ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ముందు నుంచే అంద‌రిని సంఘ‌టితం చేశారు. జ‌న‌తా క‌ర్ఫ్యూతో ప్రారంభ‌మైన ఈ పోరాటంలో త‌ర్వాత మోదీ భార‌తీయులు అంద‌రిని సంఘ‌టితం చేసి దీప జ్యోతిని వెలిగించి ప్ర‌పంచానికి మ‌న‌దేశ ఐక్య‌తా శ‌క్తిని చాటారు.

 

ఇక ఇప్పుడు కోవిడ్ 19పై చేస్తోన్న పోరాటంలో భాగంగా భార‌తీయుల ఐక్య‌మైత్యాన్ని చాటేందుకు స్విట్జ‌ర్టాండ్‌లోని మాట‌ర్‌హార్న్ ప‌ర్వ‌తం మొత్తాన్ని భార‌తీయ త్రివ‌ర్ణ ప‌తాకంతో మార్చేశారు. ఈ మూడు రంగుల జెండా న‌మూనాలో ఈ ప‌ర్వ‌తం ప్ర‌త్యేక‌మైన క‌ళ‌ను సంత‌రించుకుని భార‌త‌దేశ ఐక్య‌మత్యాన్ని స‌గ‌ర్వంగా ప్ర‌పంచానికి చాటి చెప్పింది.  ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం మ‌న‌దేశంలో ఉన్న లాక్‌డౌన్ మే 3వ తేదీ వ‌ర‌కు కంటిన్యూ కానున్న సంగ‌తి తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: