కరోనా వైరస్ ను చైనానే ప్రపంచం మీదకు వదిలిందన్న ఆరోపణలు తీవ్రతరమవుతున్నాయి. బయోవార్‌కు తెరతీసి ప్రపంచ దేశాలపై గుత్తాధిపత్యానికై చైనా ఈ ప్రాణాంతక వైరస్‌ను సృష్టిందని.. అది బెడిసికొట్టడంతో చైనీయులే మొదటి బాధితులయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి.  కరోనా వైరస్‌ పుట్టుక, కేసులు, మృతుల సంఖ్య వంటి అంశాల్లో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాలపై అమెరికా సహా ఇతర దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 

 

ఈ నేపథ్యంలో కరోనా ఆనవాళ్లు తొలిసారిగా బయటపడ్డ వుహాన్‌లో కరోనా మరణాలను 1,290 ఎక్కువగా చూపుతూ తాజా గణాంకాలు విడుదల చే యడంతో వాటికి బలం చేకూరినట్లైంది. అమెరికాకు చెందిన ఫాక్స్‌ న్యూస్‌ చానెల్‌ వెలువరించిన కథనం సంచలనంగా మారింది. వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌లో పరిశోధనలు చేస్తున్న ఇంటర్న్‌ అనుకోకుండా ఈ వైరస్‌ను లీక్‌ చేశారని సదరు మీడియా పేర్కొంన‌డం గ‌మ‌నార్హం.   అంతేగాక అమెరికాపై పైచేయి సాధించేందుకు చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం వైరస్‌ను ఉపయోగించుకోవాలని భావించిందని విశ్వసనీయ వర్గాలు తమకు వెల్లడించినట్లు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: