లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్‌కు అనేక మంది ట్వీట్ చేస్తున్నారు. త‌మ‌కు ఆప‌ద ఉందని, త‌మ‌ను సొంతూళ్లకు పంపించేందుకు అనుమ‌తి ఇప్పించాల‌ని కోరుతున్నారు. ఇందులో ప్ర‌తీ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందిస్తున్నారు. క‌చ్చిత‌మైన అవ‌స‌రాన్ని గుర్తించి, సాయం చేస్తున్నారు. అంతేగాకుండా వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తున్నారు. అయితే.. ఈక్ర‌మంలో మ‌హారాష్ట్ర‌కు చెందిన దుర్గేశ్ కుల‌క‌ర్ణి అనే వ్య‌క్తి హైద‌రాబాద్‌లో చిక్కుకుపోయాడు.

 

అయితే.. త‌న‌ను ఇంటికి పంపిచాల‌ని ట్వీట్ చేశారు.* మా అమ్మానాన్న మ‌హారాష్ట్ర‌లోని ఇంటి వ‌ద్దే ఒంట‌రిగా ఉన్నారు. వారు వృద్ధులు. చాలా ఇబ్బంది ప‌డుతున్నారు. ద‌య‌చేసి న‌న్ను మా ఇంటికి పంపించండి స‌ర్‌* అంటూ వేడుకున్నారు. స్పందించిన కేటీఆర్‌..* ఇలాంటి ప‌రిస్థితుల్లో కుటుంబానికి దూరంగా ఉండ‌డం ఎంత క‌ష్ట‌మో నేను అర్థం చేసుకోగ‌ల‌ను. కానీ.. ఇంటికి పంప‌డం సాధ్యంకాదు.. కేవ‌లం మెడిక‌ల్ ఎమెర్జెన్సీ స‌మ‌యంలో మాత్రమే ప‌పండం వీల‌వుతుంది. మీ అమ్మానాన్న‌ను అక్క‌డి ప్ర‌భుత్వం చూసుకుంటుంది. మీ త‌ల్లిదండ్రులకు ఏదైనా అత్య‌వ‌స‌రమైతే.. నాకు చెప్పండి నేను సాయం చేస్తా* అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: