మ‌న‌దేశంలో క‌రోనా దెబ్బ‌తో లాక్‌డౌన్ వల్ల ఎంతోమంది నిరుపేద‌లు నిరాశ్ర‌యులు అయ్యారు. ఈ క్ర‌మంలోనే మ‌న తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఎంతో మంది సినీ కార్మికులు షూటింగ్‌లు లేక ప‌స్తులు ఉంటున్నారు. క‌నీసం తిన‌డానికి తిండిలేక బాధ‌ప‌డుతోన్న వారు ఎంతోమంది ఉన్నారు. ఈ  నిరాశ్రయులైన పేద సినీ కార్మికులని ఆదుకునేందుకు టాలీవుడ్ సినీ పరిశ్రమ చిరంజీవి నేతృత్వలో కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 

 

ఈ సీసీసీకి ఎంతో మంది విరాళాలు ఇస్తూ త‌మ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. బ‌డా బ‌డా నిర్మాత‌లు, టెక్నీషియ‌న్లు, స్టార్ హీరోలు, ద‌ర్శ‌కులు, సింగ‌ర్లు, మ్యూజిక్ డైరెక్ట‌ర్లు ఇలా ఎంతో మంది విరాళాలు ఇస్తున్నారు. చివ‌ర‌కు హీరోయిన్లు కూడా త‌మ వంతుగా సాయం అంద‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సీసీసీకి మ‌రో ఇద్ద‌రు అగ్ర నిర్మాత‌లు త‌మ వంతుగా సాయం అంద‌జేశారు. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ తరపున ఆర్‌బీ చౌదరి, ఎన్‌వీ ప్రసాద్ రూ.5 లక్షల విరాళం అందించారు.

 

ఇక నిర్మాత మోహన్ చెరుకూరి కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ. 5లక్షల విరాళం అందించనున్నట్టు పేర్కొన్నారు. ఏదేమైనా ఇలాంటి సంక్లిష్ట ప‌రిస్థితుల్లో తాను ఏర్పాటు చేసిన సీసీసీకి ప్ర‌ముఖుల నుంచి వ‌స్తోన్న స్పంద‌న నేప‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీతో ఉన్నార‌ట‌. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: