దేశంలో కరోనా విస్తరిస్తున్న సమయంలో గత నెల 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ కారణంగా అన్ని వ్యవస్థలు ఆగిపోయాయి.   కాకపోతే కరోనా పూర్తి స్థాయిలో కట్టడి కాకపోవడంతో వచ్చే నెల 3 వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే.  తాజాగా ఏప్రిల్ 20 నుంచి దశలవారీగా ఆంక్షలు సడలించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఎల్లుండి సోమవారం నుంచి అనేక సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్రం తాజా లాక్ డౌన్ మార్గదర్శకాలను విడుదల చేసింది.

 

- రాష్ట్ర పరిధిలో, అంతర్రాష్ట్ర సరకు లోడింగ్, అన్ లోడింగ్ కు అనుమతి (రవాణా).

-ఆన్ లైన్ బోధన, దూరవిద్య కార్యక్రమాలకు ప్రోత్సాహం.

-నిత్యావసర సరుకులు, వస్తువుల రవాణాకు అనుమతి.

-వాణిజ్య, ప్రైవేటు సంస్థల కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్.

-పశుసంవర్ధక కార్యకలాపాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు.

-ఆర్థిక రంగం, సామాజిక సేవల రంగంపై ఆంక్షల తొలగింపు

-భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలన్న నిబంధనతో ఉపాధి హామీ పథకం కూలీలకు అనుమతి.

-ప్రజా సౌకర్యాలపై తొలగిన ఆంక్షలు.

-పరిశ్రమలు, పారిశ్రామిక సంస్థల కార్యకలాపాలకు అనుమతి (ప్రభుత్వ/ప్రైవేటు).

- ఆయుష్ సహా అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.

-అన్ని రకాల వ్యవసాయ కార్యకలాపాలు, ఉద్యాన కార్యకలాపాలు (హార్టీకల్చర్) నిర్వహించుకోవచ్చు.

-రొయ్యలు, చేపల పెంపంకం, ఆక్వారంగానికి చెందిన ఇతర కార్యకలాపాలపై ఆంక్షలు ఉండవు.

-తేయాకు, కాఫీ, రబ్బరు తోటల్లో పనులు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు.

-నిర్మాణ రంగ పనులు కొనసాగించవచ్చు.

-రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల మార్గదర్శకాలకు లోబడి అత్యవసర సేవల కోసం ప్రైవేటు వాహనాలను వినియోగించుకోవచ్చు. వైద్య, పశువైద్య,

- నిత్యావసరాల రవాణా, సేకరణ, నిర్దేశిత కేటగిరీల ఉద్యోగుల ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు.


-కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయి.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: