తెలంగాణ‌లోని బ‌డా కార్పొరేట్ విద్యా సంస్థ‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గ‌ట్టి షాక్ ఇచ్చింది. ఇందులో చైత‌న్య‌, నారాయ‌ణ క‌ళాశాల‌తోపాటు ప‌లు కార్పొరేట్ క‌ళాశాల‌లు కూడా ఉన్నాయి. ఇంత‌కీ ఏం జ‌రిగిందో తెలుసుకుందాం.. కార్పొరేట్ క‌ళాశాలు.. నాణ్య‌మైన చ‌దువుల పేరుతో దోపిడీకి పాల్ప‌డుతున్నాయ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. క‌నీస విద్యాప్ర‌మాణాలు పాటించ‌కుండా.. క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించ‌కుండా ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.  ఒక క‌ళాశాల‌కు మాత్ర‌మే అనుమ‌తి తీసుకుని రాష్ట్ర‌వ్యాప్తంగా అనేక బ్రాంచీల‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఎలాంటి సౌక‌ర్యాలు క‌ల్పించ‌కుండా లాభ‌మే ధ్యేయంగా యాజ‌మాన్యాలు న‌డిపిస్తున్నాయి.

 

ఇలాంటి కార్పొరేట్ విద్యాసంస్థ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ కొంద‌రు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు అనుమ‌తి లేని క‌ళాశాల‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించి. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న అనుమ‌తిలేని 68క‌ళాశాల‌ల గుర్తింపు ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఇంట‌ర్‌బోర్డుకు ఉత్త‌ర్వులు జారీ చేసింది. గుర్తింపు ర‌ద్దు చేసిన క‌ళాశాలల‌ జాబితాలో బ‌డా కార్పొరేట్ విద్యాసంస్థ‌లు చైత‌న్య‌కు చెందిన 18 క‌ళాశాల‌లు, నారాయ‌ణకు చెందిన 26క‌ళాశాలులు ఉన్నాయి. ఈ నిర్ణ‌యంపై ఆయా క‌ళాశాలలు ఏం చేస్తాయో చూడాలి మ‌రి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: