క‌రోనా వైర‌స్ మాన‌వాళికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఎయిమ్స్‌కు చెందిన న‌ర్సింగ్ అధికారిణి, అమె 20 నెల‌ల బిడ్డ ఇద్ద‌రూ క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఆ అధికారిణి భ‌ర్త‌కు కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అధికారులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆర్ఎంఎల్‌లో చికిత్స పొందుతున్న‌ట్లు తెలిపారు. వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన అధికారులు వారు ఎవ‌రెవ‌రిని క‌లిశార‌న్న‌దానిపై ఆరా తీస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌తో అధికావ‌ర్గాలు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాయి. ప్రాణాల‌కు తెగించి క‌రోనా పేషెంట్ల‌కు వైద్య‌సేవ‌లు అందిస్తున్న వైద్యులు కూడా వైర‌స్ బారిన‌ప‌డుతుండ‌డంతో కొంత ఆందోళ‌న‌క‌ర‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది.

 

క‌రోనా వైర‌స్ బారిన ప‌డుతున్న వైద్యుల సంఖ్య ఢిల్లీ, ముంబైలోనే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా క‌రోనా బారిన‌ప‌డిన వైద్య‌సిబ్బంది సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవ‌ల ముంబైలోని ఆస్ప‌త్రిలో ఏకంగా 26మంది న‌ర్సుల‌కు, ముగ్గురు డాక్ట‌ర్ల‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డం క‌ల‌క‌లం రేపింది. అలాగే. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కూడా డాక్ట‌ర్ దంప‌తుల‌తోపాటు మ‌రో న‌లుగురికి క‌రోనా సోకింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: