క‌రోనా కార‌ణంగా ప్ర‌తీ ఒక్క‌రు మాస్క్ ధ‌రించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.. మాన‌వాళికి మాస్క్ ఎంత ముఖ్య‌మో కూడా ఇప్పుడు తెలిసి వ‌చ్చింది. సర్జికల్‌ మాస్కులు మ‌న‌ల్ని అనేక వ్యాధుల నుంచి కాపాడుతాయి. మ‌న నుంచి ఎదుటివారికి.. ఎదుటివారి నుంచి మ‌న‌కు వ్యాధులు వ్యాపించ‌కుండా, కాలుష్య కోర‌ల్లో చిక్కుకోకుండా కాపాడ‌డంలో మాస్క్‌ల‌ది అత్యంత కీల‌క పాత్ర అని గుర్తించాం. అయితే.. ఈ భూమ్మీద ఉన్న ప్ర‌తీ ఒక్క‌రు మాస్క్ ధ‌రించాల్సి వ‌స్తే..ఎంత ఖ‌ర్చు అవుతుంద‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌.. దాని జ‌వాబును త‌ల‌చుకుంటేనే అమ్మో.. అనాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ జ‌నాభా 780 కోట్లు. వారందరికీ మెడికల్‌ మాస్కులు ఇవ్వాల్సి వ‌స్తే.. వారానికి దాదాపు 5,500 కోట్ల మాస్కులు అవసరమవుతాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

 

ఇక ఎంత ఖ‌ర్చు అవుతుందో తెలిస్తే మ‌నం షాక్ తినాల్సిందే మ‌రి. సుమారు రూ. 22 వేల కోట్లు అవసర‌మ‌ట‌. ఇక్క‌డ మ‌రొక విష‌యం కూడా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 6 కోట్ల మంది వైద్య సిబ్బంది ఉన్న‌ట్లు అంచ‌నా. వారందరికీ ఎన్‌–95 మాస్కులు ఇవ్వాలంటే ఒక్కో రోజుకు రూ. 229 కోట్లు ఖర్చు అవుతుంద‌ట‌. అంటే.. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌పంచంలో మాస్క్‌ల త‌యారీ అనేది పెద్ద బిజినెస్‌గా మార‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఉపాధి కూడా అదేస్థాయిలో ల‌భిస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: