ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ చైనాలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. చైనా దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా  వైరస్ మళ్లీ విజృంభించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. శీతాకాలం ప్రారంభంలో కరోనా కోరలు చాచటం ఖాయం  అని చెబుతున్నారు. ఎక్కడైతే వెలుగులోకి వచ్చిందో  అక్కడే మరోసారి విజృంభించే  అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. గతంలో ఉన్నట్టుగానే అందరు కలిసి కలివిడితనం తో ముందుకు సాగితే ముప్పును కొనితెచ్చుకున్నట్లే అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికైనా లో కరోనా  వైరస్ శీతాకాలంలో మళ్ళీ బుసలు  కొట్టడం ఖాయం అంటున్నారు శాస్త్రవేత్తలు. చైనాలో కరోనా వైరస్  పై పోరాటంలో ప్రముఖ స్పెషలిస్ట్  గురించి సంచలన నిజాలు బయటపెట్టారు. కరోనా  వైరస్ శీతాకాలంలో మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని నవంబర్ మాసానికి వైరస్ ప్రభావం మరింతగా పెరిగనుంది  ప్రపంచ దేశంలో మరణాల రేటు మరింతగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు.

 

 

ఇప్పటికే చైనా దేశంలో కరోనా  వైరస్ ప్రభావం మళ్ళీ కొంచెం కొంచెంగా చైనా దేశంలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి ప్రపంచ దేశాల పరిస్థితి అయితే చెప్పాల్సిన పనిలేదు. అమెరికాలో అయితే మనుషుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ మహమ్మారి వైరస్ తో పోరాటం చేస్తోంది. ప్రపంచ ప్రజలందరూ ప్రాణభయంతో బతుకుతున్నారూ . కరోనా పై పోరాటంలో  ఎంతో మంది  మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా  మాత్రం ఇప్పటివరకు కట్టడి చేయలేక పోతున్నారు. 

 


 అయితే ఇప్పటికీ ప్రపంచదేశాలను బెంబేలెత్తిస్తూ  విలయతాండవం చేస్తున్న కరోనా  నవంబర్ లో సీతాకాలంలో మళ్లీ బుసలు కొట్టనుంది  అని శాస్త్రవేత్తలు చెబుతున్న నేపథ్యంలో ప్రజల్లో మరింత భయం ఆందోళన నెలకొంది. అయితే ప్రపంచ దేశాలను కాదు చైనా దేశం కూడా ఈ వైరస్ అతీతం కాదు అంటున్నారు శాస్త్రవేత్తలు. రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో... శీతాకాలంలో మరింతగా  మహామారి కోరలు చాస్తే విశ్వం మొత్తం వణికి పోవాల్సిందే అంటున్నారు శాస్త్రవేత్తలు.

మరింత సమాచారం తెలుసుకోండి: