కరోనా  వైరస్ నేపథ్యంలో మహారాష్ట్రలో ఎంతటి దారుణ పరిస్థితి నెలకొందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా  వ్యాధి బారినపడి మృతుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి కాలు బయట పెట్టడం లేదు. దేశంలోనే ఎక్కువగా మహారాష్ట్రలో కరోనా  వైరస్ ప్రభావం కనిపిస్తుంది. అక్కడి ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు విధించినప్పటికీ కరోనా  వైరస్ ప్రభావం మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. కరోనా  వైరస్ ప్రభావం కారణంగా  ప్రియమైన వాళ్ళు చనిపోయిన కళ్ళచూపుకు  కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో దూరం నుండే కన్నీటి పర్యంతం అవుతూ అంత్యక్రియలు నిర్వహించాల్సిన దుస్థితి ప్రస్తుతం ఏర్పడుతుంది. తాజాగా ఇలాంటి హృదయ విదారక ఘటన జరిగింది. 


 కరోనా వైరస్  మహమ్మారి కారణంగా ఓ మహిళ తన భర్త కర్మలను 490 కిలోమీటర్ల దూరం నుంచే నిర్వహించాల్సిన  దుస్థితి ఏర్పడింది. ఈ ఘటన ఎంతోమంది మనసులను కలచివేస్తోంది. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా లో ఒక మహిళ  తన భర్త కర్మలను 490 కిలోమీటర్ల దూరం నుంచి వీడియో కాల్  ద్వారా చేసింది . ముంబైలోని దొడ్డ మార్క్  తాసిల్దార్ లోని మొర్లే  గ్రామంలో భర్త చంద్రకాంత్ విధులు నిర్వహిస్తూ ఉండేవాడు. దురదృష్టవశాత్తు చంద్రకాంత్ గురువారం మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య వసంత బండేకర్  కన్నీటి పర్యంతమైంది.

 

 లాక్ డౌన్  కారణంగా మృతదేహాన్ని ఇంటికి తీసుకు వచ్చేందుకు వీలు లేక పోవడంతో... భార్య తన భర్త కడ  చూపు కూడా నోచుకోలేక పోయింది. అటు పిల్లలు కూడా తండ్రిని కనీసం కడ చూపు కూడా నోచుకోక పోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. చేసేదేమీ లేక వీడియో కాల్ సదుపాయం ద్వారా తన తండ్రి చివరిసారిగా చూసి నివాళులర్పించడానికి వీడియో కాల్ చేశారు. అయితే లాక్ డౌన్  ప్రకటించడానికి ఒక్కరోజు ముందు మార్చ్ 22 న చివరి దశ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే అతని ఆరోగ్యం బాగా లేకపోవడంతో చెకప్ కోసం పంపామని ఈ విషయాన్ని తల్లికి చెప్పలేదు అంటూ చంద్రకాంత్ కొడుకు చెప్పుకొచ్చాడు. ఏదైనా తర్వాత అలాంటి రాక్షసి కారణంగా కనీసం ఒక్క చూపుకు కూడా నోచుకోని పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: