క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ‌లోని అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేకుండా తెలంగాణ‌ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వ మ‌రో ముంద‌డుగు వేసింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) సహా అన్ని రంగాలలోని పారిశ్రామికవర్గాలను అదుకునే దిశ‌గా ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ మేర‌కు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ స్వ‌యంగా రంగంలోకి దిగారు. సీఐఐ ప్ర‌తినిధుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి, వారికి భ‌రోసా ఇచ్చారు.

 

అంతేగాకుండ‌గా పారిశ్రామిక‌వ‌ర్గాల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, లాక్‌డౌన్ త‌ర్వాత ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దుకుంటాయ‌ని ఆయ‌న అన్నారు. ఇద స‌మ‌యంలో లైఫ్‌ సైన్సెస్‌, వైద్యరంగంలో ఉన్న కొత్త అవకాశాలను వినియోగించుకోవాల‌ని సూచించారు. నష్టాలపేరు తో ఉద్యోగులను తొలగించవద్దని విజ్ఞప్తిచేశారు. లాక్‌డౌన్ త‌ర్వాత పారిశ్రామిక వ‌ర్గాల‌తో స‌మావేశం నిర్వ‌హించి, రంగాల పటిష్ట‌త‌కు క‌లిసిక‌ట్టుగా ముందుకు వెళ్దామ‌ని ఆయ‌న అన్నారు. న‌ష్టాల పేరుతో ఉద్యోగుల‌ను తొల‌గించ‌వ‌ద్ద‌ని ఆయ‌న కోరారు. తెలంగాణ‌లో  కరోనా కట్టడికి ప్రభుత్వం అన్నిచ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని చెప్పారు. ప్రజలు స్వీయనియంత్రణ, సామాజిక‌ దూరం పాటించాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: