భార‌త్‌లో కొవిడ్‌-19 విజృంభిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. క‌రోనా క‌ట్ట‌డికి లాక్ డౌన్ ను మించిన ప‌రిష్కారం లేద‌ని భావించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ లాక్‌డౌన్‌ను ఈనెల 14 వ తేదీ నుంచి మే 3 వ‌ర‌కు పొడిగించిన సంగ‌తి తెలిసిందే. ఈనెల 20 వ తేదీ నుంచి కేసులు త‌క్కువ‌గా ఉన్న ప్రాంతాల‌ల్లో లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను కొంత స‌డ‌లించ‌నున్న‌ట్లు పేర్కొంటున్నారు. 

ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్నా, కొంద‌రు యథేచ్ఛ‌గా ఉల్లంఘిస్తున్నారు.  ఆయా ప్రాంతాల్లో రోడ్ల‌పైకి వ‌చ్చే ప్ర జ‌ల‌ను క‌ట్ట‌డి చేయ‌డం పోలీసుల‌కు స‌వాల్ గా మారుతోంది.  ఈక్ర‌మంలోనే  కొంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా క‌ర్నాట‌క‌లోని క‌ల్బుర్గిలో  లాక్‌డౌన్ ను ఉల్లంఘించి రోడ్ల‌పైకి వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు వాహ‌న‌దారుల‌కు షాక్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. లాక్ డౌన్ అమ‌లు కోసం న‌గ‌ర పోలీసులు ప్ర‌త్యేక డ్రైవ్ చేప‌ట్టారు. ఇందులో భాగంగా ఆంక్ష‌లు ఉల్లంఘించిన  4,200 వాహ‌నాలను స్వాధీనం చేసుకున్న‌ట్లు క‌ల‌బురిగి డీసీసీ కిశోర్ బాబు వెల్ల‌డించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: