భోజన ప్రియులు కొత్త రుచులకోసం ఎక్కువగా బయట ఫాస్ట్ ఫుడ్  లపై ఆధారపడతారు . ఈ క్రమంలోనే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బాయ్ కి కరోనా అని తేలింది. ఈ సంఘటనతో హైదరాబాద్ ప్రజలు ఒక్క సారిగా ఉలిక్కి పడుతున్నారు. మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్ధనల అనంతరం కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగి 16 వేలకు చేరుకుంది. కరోనా మహమ్మారి ఎటువైపునుండి సోకుతుందో తెలియక ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసు ఎక్కువ శాతం ghmc పరిధిలోనే నమోదు అయ్యాయి.  

 

హైదరాబాద్ నాంపల్లి ఏరియా కు చెందిన ఓ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ వచ్చిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. అయితే ఈ వ్యక్తిని క్వారంటైన్ కి తరలించారు ఇతనితోపాటు ఇతని కుటుంబ సభ్యులనుకూడా తరలించారు. అయితే పోలీస్ వారు మాత్రం సదరు వ్యక్తి ఫుడ్ ఆర్డర్స్ డెలివరీ చేసిన అన్ని అడ్రస్ లను సేకరిస్తున్నారు అదేవిధంగా ఏ ఏ హోటల్స్ లో ఆర్డర్ ఇచ్చాడో అన్ని వివరాలను రాబడుతున్నారు. ఇప్పటివరకు తెలంగాణా లో 809 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి మరియు 18 మరణాలు సంభవించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: