భార‌త్‌లో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. కేవ‌లం 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే 1334 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా 27మంది మ‌ర‌ణించారు. దీంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 505కు పెరిగిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఇప్పటివరకు 16,116 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 2,230మంది క‌రోనా వైర‌స్ బారి నుంచి కోలుకున్నార‌ని తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు 3,86,791 క‌రోనా నిర్ధార‌ణ‌ పరీక్షలు చేసామ‌ని ఐసీఎంఆర్ ప్ర‌తినిధి తెలిపారు. నిన్న 37,173 పరీక్షలు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. వీటిలో 29,287 పరీక్షలు ఐసీఎంఆర్ ప‌రిధిలోని ల్యాబ్‌లలో, ప్రైవేటు ల్యాబ్‌ల‌లో  7,886 పరీక్షలు చేసిన‌ట్లు తెలిపారు.

 

అత్య‌ధికంగా ప‌లు రాష్ట్రాల్లో  కేసులు న‌మోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో 3648 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో  211 మంది మరణించారు. ఆ తర్వాత ఢిల్లీలో 1893 మందికి క‌రోనా సోకింది. ఇందులో 43 మంది మరణించారు. గుజరాత్‌లో 1604 మంది క‌రోనా బారిన‌ పడ్డారు. ఇప్పటివరకు 58 మంది మరణించారు. రాజస్థాన్లో మొత్తం 1431 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 22 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లో 1402 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 69మంది మరణించారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: