ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న క‌రోనా వైర‌స్‌కు విరుగుడు క‌నిపెట్టేందుకు అనేక ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. మ‌హ‌మ్మారికి మందును క‌నిపెట్టి మాన‌వాళిని కాపాడేందుకు శాస్త్ర‌వేత్త‌లు రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇదే క్ర‌మంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆయుర్వేద విభాగం కూడా క‌రోనా వైర‌స్‌కు మందును క‌నిపెట్టే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. ఇప్ప‌టికే వైద్యం, మందుల తయారీ సేవలు అందిస్తున్న టీటీడీ ఆయుర్వేద విభాగం కరోనాకు విరుగుడు త‌యారు చేసేందుకుప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డం అంద‌రిలో ఆస‌క్తిరేపుతోంది.

 

ఈ క్ర‌మంలోనే ఎస్వీ ఆయుర్వేద కళాశాల, వైద్య కళాశాల, ఫార్మసీల నేతృత్వంలో ఐదు రకాల మందులు తయారు చేయించి పంపణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మందులు వాడిన వారి నుంచి ఫార్మసీ అధికారులు అభిప్రాయాలు  సేకరించారు. వారిచ్చిన స‌మాచారం మేర‌కు మరిన్ని ఆయుర్వేద మూలికలు జోడించి కొత్త ఫార్ములాతో మందులు తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ఆయుష్‌ శాఖకు ఈ ఐదు రకాల ఉత్పత్తులు సరఫరా చేసేందుకు లైసన్స్ కోసం చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే.. డిసెంబర్‌ లోగా లైసన్స్‌ వస్తుందని అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: