తెలంగాణ‌లో క‌రోనా కేసులు ఆదివారంతో క‌లుపుకుంటే మొత్తం 858 కేసులు ఉన్నాయ‌ని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆదివారం సుదీర్ఘ‌మైన కేబినెట్ స‌మావేశం త‌ర్వాత రాత్రి విలేక‌ర్ల‌తో మాట్లాడిన ఆయ‌న ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ఎలా ప్ర‌భావం చేస్తుందో ?  చెప్పారు. కొన్ని దేశాల్లో (సింగ‌పూర్‌)  లాక్‌డౌన్ ఎత్తేసి మ‌ళ్లీ లాక్ డౌన్ అమ‌లు చేస్తున్నార‌ని చెప్పారు. ఇక తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 186 మంది డిశ్చార్జ్ అయ్యార‌ని.. ఇక 658 మంది చికిత్స పొందుతున్నార‌ని కేసీఆర్ తెలిపారు.

 

అయితే దేశ‌వ్యాప్తంగా క‌రోనా వృద్ధిరేటు చూస్తే తెలంగాణ‌లో క‌రోనా త‌గ్గుతోంద‌నే చెప్పాల‌ని అన్నారు. తెలంగాణ‌లో క‌రోనా వృద్ధిరేటు 2.44 శాతం నమోదు అవుతుంటే అదే దేశ‌వ్యాప్తంగా ఇది 3.22 శాతం ఉంద‌ని అన్నారు.  కేసీఆర్ చెప్పిన లెక్క‌ల‌ను బ‌ట్టి చూస్తే తెలంగాణ‌లో క‌రోనా కేసులు పెరుగుతున్నా వృద్ధిరేటు మాత్రం దేశంతో పోలిస్తే త‌క్కువ‌గానే ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: