ఏప్రిల్  20వ తేదీ త‌ర్వాత ఎలాంటి స‌డ‌లింపులు లేకుండా మే 3వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తామ‌ని ఢి్ల్లీ, మ‌హారాష్ట్రాల ప్ర‌భుత్వాలు నిర్ణ‌యం తీసుకున్నాయి. తాజాగా.. ఆ రాష్ట్రాల‌ దారిలోనే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ న‌డిచారు. ఆ రాష్ట్రాల కంటే మ‌రో అడుగు ముందుకు వేశారు. ఈ నెల 20వ తేదీ త‌ర్వాత ఎట్టిప‌రిస్థితుల్లోనూ లాక్‌డౌన్ అమ‌లులో స‌డ‌లింపులు లేవ‌ని స్ప‌ష్టం చేశారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి మే 7వ తేదీవ‌ర‌కు మ‌రింత క‌ఠినంగా లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఆదివారం మ‌ధ్యాహ్నం నుంచి సుమారు ఐదారు గంట‌ల పాటు మంత్రివ‌ర్గం స‌మావేశం నిర్వ‌హించారు.

 

అనంత‌రం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి వివ‌రాలు వెల్ల‌డించారు. తెలంగాణ‌లో కూడా మే 7వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను స‌డ‌లింపులు లేకుండా అమ‌లు చేస్తామ‌ని ఆయ‌న చెప్పారు. ఇదే స‌మ‌యంలో కేసుల వివ‌రాలు వెల్ల‌డించారు. తెలంగాణలో ఈ రోజు కొత్తగా 18 కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కేసులు 858 చేరుకున్నాయని ముఖ్య‌మంత్రికేసీఆర్ తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ‌లో 21 మంది మ‌ర‌ణించార‌ని తెలిపారు. 186 మంది క‌రోనా నుంచి కోలుకున్నార‌ని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: