తెలంగాణ‌లో ప్ర‌స్తుతం మే 3వ తేదీ వ‌ర‌కు ఉన్న లాక్‌డౌన్‌ను మే 7వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్టు సీఎం కేసీఆర్ చెప్పారు. ఆదివారం రాత్రి విలేక‌ర్ల స‌మావేశంలో కేసీఆర్ ఈ విష‌యం వెల్ల‌డించారు. ఇదిలా ఉంటే నిజాముద్దీన్ వ‌ల్లే మ‌న‌కు కేసులు పెరిగాయ‌ని కూడా కేసీఆర్ తెలిపారు. ఢిల్లీ నుంచి వ‌చ్చిన వారి వ‌ల్లే ఈ ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌ని కేసీఆర్ చెప్పారు. ఇక ప‌లు మీడియా సంస్థ‌లు అయిన ఎన్టీవీ, టీవీ 9, న‌మ‌స్తే తెలంగాణ పేప‌ర్ చేసిన స‌ర్వేల్లో చాలా మంది లాక్‌డౌన్ పొడిగించాల‌ని ప్ర‌జ‌లు చెప్పార‌ని.. ఇక తాను కూడా రైతులు, మంత్రులు, ప్ర‌జ‌లు, రైతులు, కూలీలు అంద‌రూ కూడా లాక్‌డౌన్ పొడిగించాల‌నే చెప్పార‌ని కేసీఆర్ అన్నారు. 

 

అయితే మే 5వ తేదీన మ‌ళ్లీ కేబినెట్ స‌మావేశం ఉంటుంద‌ని.. ఆ త‌ర్వాత ప‌రిస్థితుల‌ను బ‌ట్టి.. వ్యాధి తీవ్ర‌త‌ను బ‌ట్టి మే నెలాఖ‌ర‌వ‌ర‌కు కూడా లాక్‌డౌన్ పొడిగించే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న సందేహాలు కూడా కేసీఆర్ వ్య‌క్తం చేశారు. దీనిని బ‌ట్టి క‌రోనా త‌గ్గితే ఓకే లేక‌పోతే తెలంగాణ‌లో మే నెలాఖ‌ర వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగించినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: