తెలంగాణ సీఎం కేసీఆర్ ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ సంస్థ‌లు అయిన సిగ్గి, జొమాటోకు షాక్ ఇచ్చారు. ఆదివారం వ‌ర‌కు ఆన్‌లైన్లో బుక్ చేసుకున్న ఫుడ్స్ ను మిన‌హాయిస్తే సోమ‌వారం నుంచి ఈ రెండు సంస్థ‌ల ద్వారా ఫుడ్ బుకింగ్‌ను పూర్తిగా నిషేధిస్తున్న‌ట్టు కేసీఆర్ చెప్పారు. ఇందుకు కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు కూడా ఆయ‌న చెప్పారు. వీటి వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని.. పిజ్జా ఒక వ్య‌క్తి  ఇంటికి డోర్ డెలివ‌రీ చేస్తే దేశ రాజ‌ధాని న్యూ ఢిల్లీలో ఏకంగా 69 మందికి క‌రోనా ఎఫెక్ట్ అయ్యింద‌ని కేసీఆర్ చెప్పారు. 

 

ఈ 10 - 15 రోజులు పిజ్జా తిన‌క‌పోతే ఏం అవ‌ద‌ని.. ఇంట్లో ఉండే ప‌ప్పో ఉప్పో తిని ఈ 15 రోజులు స‌రిపెట్టుకోవాల‌ని.. బ‌య‌ట నుంచి తినుబండ‌రాలు ఎంత మాత్రం తెచ్చుకోవ‌ద్ద‌న్నారు. మ‌న ప్రాణాల‌కు మించి ఏ తిండులు అవ‌స‌రం లేద‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఫుడ్ డోర్ డెలివ‌రీ వ‌ల్ల కూడా చాలా ప్ర‌మాదం ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: