తెలంగాణ‌లో ఎలాంటి లాక్‌డౌన్ స‌డ‌లింపులు లేవ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. గ‌తంలో ఉన్న నిబంధ‌న‌లే య‌ధాత‌దంగా కొన‌సాగుతాయ‌ని ఆయ‌న చెప్పారు.  క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి ఇంత‌కు ముందు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలాంటి ఆంక్ష‌లు విధించిందో... అవ‌న్నీ కొన‌సాగుతాయ‌ని సీఎం చెప్పారు. 
నిత్యావ‌స‌ర స‌రుకుల స‌ర‌ఫ‌రా య‌ధావిధిగా ఉంటుంద‌ని తెలిపారు. ఆదివారం మ‌ధ్యాహ్నం ప్రారంభ‌మైన తెలంగాణ కేబినెట్ స‌మావేశం రాత్రికి ము గిసింది. స‌మావేశం అనంత‌రం ముఖ్యంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. 

 

లాక్‌డౌన్ ను తొల‌గించిన దేశాలు ప్ర‌స్తుతం ఇబ్బందులు ప‌డుతున్నాయ‌న్నారు. మే 1 త‌ర్వాత రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గే అవ‌కాశం ఉందన్నారు. మే 5 త‌ర్వాత మ‌రో సారి కేబినెట్ స‌మావేశం ఉంటుంద‌ని సీఎం చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించిన స‌ర్వేల‌తోపాటు, ప‌లు చాన‌ళ్లు నిర్వ‌హించిన స‌మ్మెలో తొంభై శాతం మంది లాక్‌డౌన్ ను పొడిగించ‌మ‌ని కోరార‌ని,  అంద‌రి సూచ‌న‌ల మేర‌కు లాక్‌డౌన్ ను మే 7వ తేదీ వ‌ర‌కు పొ డిగించ‌నున్న‌ట్లు సీఎం చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: