తెలంగాణ‌లో క‌రోనాపై పోరాటం చేస్తోన్న ప్ర‌తి ఒక్క‌రికి సీఎం కేసీఆర్ ధన్య‌వాదాలు తెలిపారు. ఈ క్ర‌మంలోనే క‌రోనాపై పోరాటం చేస్తోన్న కేసీఆర్ అదిరిపోయే ఆఫ‌ర్లు ఇస్తున్నారు. ఇక ఇప్ప‌టికే వైద్య సిబ్బందికి, పారిశుధ్య సిబ్బందికి గ‌తంలోనే 10 శాతం బోన‌స్ శాల‌రీ ఇవ్వాల‌ని తీర్మానించామ‌ని.. ఇక ఈ నెల నుంచి పోలీసు సిబ్బందికి కూడా 10 శాతం బోన‌స్ ఇవ్వాల‌ని కేబినెట్ తీర్మానించింద‌ని కేసీఆర్ తెలిపారు. ఈ క్లిష్ట స‌మ‌యంలో వీరు చేస్తోన్న పోరాటాన్ని కేసీఆర్ ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు.

 

ఇక విద్యుత్ శాఖ ఉద్యోగుల‌కు గ‌త నెల 50 శాతం జీతం ఇవ్వ‌గా ఈ నెల నుంచి వారికి నూటికి నూరు శాతం జీతాలు ఇవ్వ‌నున్నారు. దేశ వ్యాప్తంగా మే 3వరకు మాత్రమే కేంద్రం లాక్ డౌన్ పెట్టగా... తెలంగాణలో దానిని మే 7 వరకే పొడిగించే అంశాన్ని కేబినెట్ ముందు పెట్ట‌గా దీనిని తీర్మానించామ‌ని ఆయ‌న తెలిపారు. మే 7 తేదీ త‌ర్వాత కూడా ప‌రిస్థితి స‌మీక్షించి మ‌ళ్లీ కేసీఆర్ నిర్ణ‌యం తీసుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: