తెలంగాణ‌లో లాక్‌డౌన్ పొడిగింపు సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ఎన్నో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు, కరోనా వైరస్‌ నియంత్రణ వంటి అంశాలపై కేబినెట్  సుదీర్ఘంగా చ‌ర్చించింది.

 

ఏదేమైనా క‌రోనాపై పోరాటం విష‌యంలో కేసీఆర్ ఇప్ప‌ట్లో ఎంత మాత్రం వెన‌క్కి త‌గ్గే ఛాన్సే లేద‌ని తేల్చేసింది. ఈ క్ర‌మంలోనే గ‌చ్చిబౌలి స్టేడియం వైద్యానికి కేటాయిస్తున్న‌ట్టు చెప్పారు. గ‌చ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్ ఆసుప‌త్రిలో ఉన్న 9.16 ఎక‌రాల‌ను కూడా తెలంగాణ వైద్య శాఖ‌కే కేటాయిస్తున్నామ‌న్నారు. దీనికి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్‌గా పేరు మార్పు చేస్తున్నామ‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: