తెలంగాణ లో కరోనా కేసులు.. లాక్ డౌన్ విషయం పై మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.  రాష్ట్రంలో వైరస్ తీరుతెన్నులు, ఇతర స్థితిగతులు అన్నీ పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం ప్రకటిస్తున్నామని చెప్పారు. ఇవాళ 450 వరకు టెస్టులు జరిపితే 18 మాత్రమే పాజిటివ్ వచ్చాయని, మే మొదటి వారం నుంచి కేసుల సంఖ్య మరింత తగ్గుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ చెబుతోందని వివరించారు. 1897 అంటురోగాల చట్టం జీవో ప్రకారం కేంద్రానికి ఏవైతే అధికారాలు ఉంటాయో రాష్ట్రానికి కూడా అవే అధికారాలు ఉంటాయని సీఎం కేసీఆర్ తెలిపారు.

 

ఈ నేపథ్యంలో తెలంగాణ పరిస్థితుల దృష్ట్యా కఠిన నిర్ణయం తీసుకున్నామని, లాక్ డౌన్ కఠిన అమలుకు తాజా ఆదేశాలు జారీ చేస్తున్నామని చెప్పారు.   కంటైన్ మెంట్ అంటే నిలువరించడం అని అర్థం.. అంటే కంటైన్ మెంట్ ఏరియాలో ఉన్న ప్రమాదంపై ప్రత్యేకంగా మాట్లాడారు.  ఎలాంటి డేంజర్ వ్యాధి అయినా ఆ ఏరియా దాటకుండా.. ఆపి వేయడం లేదా నిలువరించడం అని అర్థం.  కంటైన్ మెంట్ ఏరియా వారి విషయంలో తగు జాగ్రత్తలు చెప్పారు.  కంటైన్ మెంట్ ఏరియాలో ఆరోగ్య మంత్రి, మున్సిపల్ మంత్రి, డీజీపీ, అర్బన్ డెవలప్ మెంట్ సెక్రెటరీ   స్వయంగా తిరిగారు.  

 

ఈ ఏరియాలో ఎందుకు కంటైన్ చేయాల్సి వచ్చిందని ప్రజలకు చెప్పారు. కంటైన్ మెంట్ లో ఉన్న ప్రజలకు పదే పదే చెబుతన్నా... ఇప్పుడు జాగ్రత్తగా ఉంటే భవిష్యత్ బాగుంటుందని.. లేదంటే మనమే ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నవాళ్లం అవుతామన్నారు సీఎం కేసీఆర్.  మీ వల్ల సమాజానికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: