తెలంగాణ‌లో లాక్‌డౌన్ నేప‌థ్యంలో మే 7వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్టు చెప్పిన సీఎం కేసీఆర్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. కేంద్రం తీసుకున్న 3వ తేదీ లాక్‌డౌన్‌ను ఆయ‌న 7వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్టు చెప్పారు. ఇక తెలంగాణ‌లో ఇప్ప‌టికే అన్ని పెళ్లిళ్లు, ఫంక్ష‌న్లు ర‌ద్ద‌య్యాయి.  

 

ఇక మే 7వ తేదీ త‌ర్వాత లాక్‌డౌన్ ఆపేసినా పెళ్లిళ్లు, ఫంక్ష‌న్ల‌కు మాత్రం మ‌రో నెల రోజుల వ‌ర‌కు అనుమ‌తి ఇచ్చే ప్ర‌శ‌క్తే లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. కేసీఆర్ నిర్ణ‌యంతో ఈ స‌మ్మ‌ర్‌లో పెళ్లిళ్లు చేసుకోవాల‌నుకున్న వారి ఆశ‌లు అడియాస‌లే అయ్యాయి. తెలంగాణ‌లో ఉన్న అన్ని క‌ళ్యాణ మండ‌పాలు, ఫంక్ష‌న్ హాల్స్‌ను తాత్కాలిక గోడౌన్లుగా మార్చి రైతుల‌కు ఎరువులు స‌ర‌ఫ‌రా చేసేందుకు వాడుకోవాల‌ని వ్య‌వ‌సాయ శాఖ‌కు ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: