తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్‌డౌన్ పొడిగింపుపై క్లారిటీ ఇచ్చేశారు. తెలంగాణ‌లో మే 7వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ కంటిన్యూ అవుతుంది. మే 5వ తేదీన తిరిగి మంత్రి వర్గం సమావేశమై లాక్ డౌన్ పై సమీక్షిస్తుందని కేసీఆర్ తెలిపారు. స్విగ్గీ, జొమాటో వంటి వాటిపై కూడా నిషేధం కొనసాగుతుందన్నారు. నిత్యావసర వస్తువులు మాత్రం తెప్పించుకోవచ్చన్నారు. సామూహిక ప్రార్థనలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించే ప్రసక్తి లేదన్నారు.

 

ఈ క్ర‌మంలోనే ప‌లు మీడియా సంస్థ‌ల స‌ర్వేల్లో సైతం తెలంగాణ ప్ర‌జ‌లు లాక్‌డౌన్ పొడిగింపుకే ఓట్లేశార‌ని కేసీఆర్ చెప్పారు. ఎన్టీవీ, టీవీ 9తో పాటు న‌మ‌స్తే తెలంగాణ మీడియా సంస్థ‌ల స‌ర్వేలో నూటికి 90కు పైగా జ‌నాలు లాక్‌డౌన్ పొడిగింపు ఉండాల‌ని చెప్పార‌న్నారు. ఇక తాము  ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరిపామన్నారు. 94 శాతం మంది లాక్ డౌన్ ను పొడిగించాలన్నారు. దీంతో మే 7వ తేదీ వరకూ తెలంగాణలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: