క‌రోనాతో నెల‌న్న‌ర వ‌య‌స్సున్న బాలుడు మృతి చెందింది. దేశంలో క‌రోనాతో మృతి చెందిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న కళావ‌తి సరన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో చోటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితం శిశువును ఆసుపత్రికి తీసుకురాగా ప‌రీక్ష‌లుచేయ‌డంగా క‌రోనా పాజిటివ్ అని తేలిసింది. వెంట‌నే ఆస్ప‌త్రిలో చేర్చి చికిత్స అందిస్తుండ‌గా ప‌రిస్థితి విష‌మించి శిన‌వారం ఉద‌యం మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు  తెలిపారు.

 

ఇటీవ‌ల 45 రోజుల శిశువు, 10 నెలల శిశువును ఆస్ప‌త్రి అత్యవసర విభాగానికి తీసుకువచ్చారు. అయితే.. వీరికి ప‌రీక్ష‌లు చేయ‌గా క‌రోనా పాజిటివ్ అని తేలింది. వెంట‌నే వారిని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలోని కోవిడ్ -19 బ్లాక్‌కు తరలించినట్లు సీనియర్ డాక్టర్ తెలిపారు. చికిత్స పొందుతూ.. నెల‌న్న‌ర బాలుడు మృతి చెందిన‌ట్లు తెలిపారు. కాగా, ఢిల్లీలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం కరోనావైరస్ కేసులు 2003కు చేరుకున్నాయి. ఇందులో ఆదివారం 110 కొత్త కేసులు, 24గంట‌ల్లో రెండు మరణాలు సంభ‌వించాయ‌ని ఢిల్లీ ప్ర‌భుత్వ అధికారులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: