దేశంలో నానాటికీ   కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. మార్కస్ నిజాముద్దీన్ మత ప్రార్థనల అనంతరం  దేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకూ దేశంలో 17265 కేసులు నమోదు కాగా 543 మరణాలు సంభవించాయి మరియు 2,547   కేసులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దేశంలో ఇప్పటి వరకు అత్యధికంగా  కేసులు మహారాష్ట్రలో  నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4203 గా నమోదయింది. కాగా 223 మరణాలు సంభవించాయి 507 కేసులు రీఛార్జి కాబడ్డాయి.

 

మహారాష్ట్ర తర్వాతి స్థానంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో 2003 కేసులు నమోదయ్యాయి ఇందులో 45 మరణాలు మరియు 72 కేసులు నార్మల్ డిశ్చార్జి అయ్యారు. ఢిల్లీ తర్వాత స్థానంలో  గుజరాత్ లో అత్యధిక కేసులు నమోదయ్యాయి ఈ రాష్ట్రం నుంచి 63 మంది చనిపోగా 105 మంది కోలుకున్నారు.  ఆ తర్వాతి స్థానంలో రాజస్థాన్  ఉంది ఈ రాష్ట్రంలో మొత్తం  1478 కేసులు నమోదయ్యాయి  కాగా 14 మరణాలు మరియు 183 మంది డిశ్చార్జి అయ్యారు. ఇకపోతే దేశంలో అతి తక్కువ నమోదైన రాష్ట్రాలలో మిజోరాం,  అరుణాచల్ ప్రదేశ్  లో కేవలం ఒక్కొక్క కేసులు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: