దేశవ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో  కరోనా ఓ రేంజ్ లో   విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో అనగా ఆదివారం ఒక్కరోజే 552 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో మహారాష్ట్ర లో మొత్తం కేసుల సంఖ్య   4203 కి చేరుకొంది. దేశవ్యాప్తంగా నమోదైన కేసులో మహారాష్ట్రనే ముందు వరుసలో ఉంది. దేశంలో ఎన్నడూ లేనంత విధంగా 1712 కేసు నమోదు కావడం రికార్డుగా చెప్పుకుంటున్నారు. దీనితో కరోనా కేసు మొత్తం సంఖ్య 17265 కి చేరింది. మరియు 565 మరణాలు దేశవ్యాప్తంగా సంభవించాయి. ఈ మరణాలలో మహారాష్ట్ర నుంచి 223 కేసులు ఉన్నాయి.

 

దేశ మరణాల లో మహారాష్ట్ర వాటా 40 శాతంగా ఉంది .దేశంలో కరోనా మరణాల శాతం 3.5 గా నమోదయింది అని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలియజేశాడు .అయితే  ఇప్పటివరకూ 2621  మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశంలోని 54 జిల్లాల పరిధిలో గత 14 రోజుల్లో ఒక్క కేసు కూడా రికార్డు కాకపోవడం గమనార్హం. కరోనా  నివారణకు వ్యాక్సిన్లు,  ఔషధాలు టెస్టింగ్ కోసం వైద్య శాస్త్ర సంబంధ రంగాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఆదివారం ఏర్పాటైందని లవ్ అగర్వాల్ తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య ఈ విధంగా ఉంది ముంబైలో 2079, ఇండోర్లో 852, న్యూఢిల్లీ 802, అహ్మదాబాద్ 590, పూణే 496, జైపూర్ 489, హైదరాబాద్ 407,  థానే 293, దక్షిణ ఢిల్లీ 320, చెన్నై 222 కేసులుగా నమోదయ్యాయి

మరింత సమాచారం తెలుసుకోండి: