లాక్ డౌన్ నేప‌థ్యంలో ఈనెల 15న జారీ చేసిన మార్గదర్శకాలను తప్పక పాటించాల్సిందేనని అన్ని రాష్ట్రాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చే సింది. దేశవ్యాప్తంగా హాట్‌స్పాట్‌ కాని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ మినహాయింపులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ క్ర‌మంలోనే అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా  లేఖ రాశారు.

 

లాక్‌డౌన్‌ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారం అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు. అత్యవసరం కాని సేవలు, కార్యకలాపాలకు పలు రాష్ట్రాలు అనుమతిస్తున్నట్లు సమాచారం వస్తోందన్నారు. ఎవరికి వారి నిర్ణయాల వల్ల దేశమంతా నష్టపోయే పరిస్థితి రాకూడదని హెచ్చరించింది.
 ఇదిలా ఉంటే.. కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకీ  ఉద్ధృతం అవుతోంది. గత 24 గంటల్లో 1,533 కొత్త కేసులు నమోదుకావడంతో దేశంలో వైరస్ బా రినపడ్డవారి సంఖ్య 17,265కు పెరిగింది. ఇక కొత్తగా 36 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 543కు చేరింది

 

మరింత సమాచారం తెలుసుకోండి: