భార‌త్‌లో క‌రోనా ర‌హిత రాష్ట్రాల జాబితాలో మ‌రో రాష్ట్రం కూడా చేరే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే గోవా, మ‌ణిపూర్‌లు క‌రోనా ఫ్రీ రాష్ట్రాలు మొద‌టి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇక మూడో రాష్ట్రంగా మిజోరం నిలిచే అవ‌కాశం ఉంద‌ని. ఎందుకంటే.. మార్చి 25వ తేదీ నుండి మిజోరంలో ఒక్క‌టి కూడా కొత్త‌గా క‌రోనా కేసు న‌మోదు కాలేదు. మార్చి 25న మొద‌టి కేసు న‌మోదు అయింది. 50ఏళ్ల పాస్ట‌ర్‌కు క‌రోనా సోకింది. ఇక అప్ప‌టి నుంచి మిజోరాంలో క‌రోనా కేసు న‌మోదు కాలేద‌ని సీనియర్ అధికారి తెలిపారు. అంటే.. ఈ రాష్ట్రంలో ఇదే మొద‌టి కేసు.. ఇదే చివ‌రి కేసుగా మారే అవ‌కాశాలు ఉన్నాయి.

 

దీంతో క‌రోనాను జ‌యించిన మూడో రాష్ట్రంగా మిజోరాం అవ‌రించ‌నుంద‌ని ఆ రాష్ట్ర అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండ‌గా.. ఇప్ప‌టికే గోవా క‌రోనాను జ‌యించిన మొద‌టి రాష్ట్రంగా రికార్టు సృష్టించింది. తాజాగా ఆ జాబితాలో మ‌ణిపూర్ చేరింది. ఈ రాష్ట్రం కూడా క‌రోనాపై విజ‌యం సాధించింది. తమ రాష్ట్రంలో కోవిడ్‌ సోకిన ఇద్దరు పేషెంట్లు పూర్తిగా కోలుకున్నారని, వారికి నిర్వహించిన కరోనా వైరస్‌ నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిందని మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బీరేన్‌ సింగ్ స్వ‌యంగా ప్రకటించారు. ఈ రాష్ట్రంలో కొవిడ్19 బారిన బాధితులిద్ద‌రూ కోలుకున్నార‌ని రాష్ట్రంలో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులేవీ నమోదు కాలేదని ఆయ‌న పేర్కొన్నారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: