గతంలో ఇండియా యొక్క ధాన్యాగారం గా గోదావరి జిల్లా ఉండేది.  కానీ  లాక్ డౌన్ కారణంగా పరిస్థితులు మారాయి. తెలంగాణలో రబీ సీజన్ కు గాను ప్రభుత్వం  రైతులకు సేద్యపు నీటిని యదేచ్ఛగా అందించడం జరిగింది. దీనితో పంటలు బాగా పండి తెలంగాణను భారతదేశపు ధాన్యాగారం గా  పిలిచే స్థాయికి  చేరేందుకు తోడ్పడింది.

 

తెలంగాణలో రబీ సీజన్లో పంట విస్తీర్ణం గత సంవత్సరంతో పోల్చుకుంటే  184 శాతం పెరిగింది. అధికంగా తెలంగాణలోనీ ఖమ్మం జిల్లాలో వరి పంట అధికంగా సాగు బడి జరిగింది మరియు కామారెడ్డి, మెదక్, మహబూబాబాద్, జనగాం, సిరిసిల్ల మరియు వరంగల్ రూరల్ ప్రాంతాలలో పంట అధిక  మొత్తంలో  నమోదయింది. పోయిన సంవత్సరం 29.19  లక్షల ఎకరాలు వరి సాగుబడి జరగగా ఈ సంవత్సరం 53.67 లక్షల ఎకరాలలో వరి వేయడం జరిగింది. 

 

మొత్తం ఏరియా :
2018-2019: 29.19  లక్షల ఎకరాలు 
2019-2020: 53.67 లక్షల ఎకరాలు 

మరింత సమాచారం తెలుసుకోండి: