క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ప్ర‌పంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ ను అమ‌లు చేస్తున్నాయి. దీంతో జ‌న జీవ‌నం పూర్తిగా స్తంభించింది. నిత్యావ‌స‌ర సేవ‌ల మినహా... అన్ని మూత‌బ‌డ్డాయి. సినిమాహాళ్లు, హోట‌ళ్లు, రెస్టారెంట్లు, బార్లు తెరుచుకోవ‌డంలేదు.  అయితే జార్జియాలో మాత్ర ఏప్రిల్ 27 న సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు తిరిగి తెరవడానికి అనుమతిస్తున్న‌ట్లు గవర్నర్ బ్రియాన్ కెంప్ సోమవారం ప్రకటించారు.

"నిర్దిష్ట సామాజిక దూరం మరియు పారిశుద్ధ్య ఆదేశాలకు లోబడి, థియేటర్లు, ప్రైవేట్ సోషల్ క్లబ్‌లు మరియు రెస్టారెంట్ డైన్-ఇన్ సేవలు ఏప్రిల్ 27, సోమవారం తిరిగి తెరవడానికి అనుమతించబడతాయి" అని కెంప్ చెప్పారు. అంతేగాక జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లు, బార్బర్ షాపులు, హెయిర్ సెలూన్లు మరియు నెయిల్ సెలూన్లు కూడా ఏప్రిల్ 24 న తెరవడానికి అనుమతించబడతాయి. జార్జియన్లు చర్చి సేవలకు హాజరుకావడానికి అనుమ తించబడతారని కెంప్ చెప్పారు, అయితే చర్చికి వెళ్ళేవారు కూడా సామాజిక దూరాన్ని గమనించాలని సలహా ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: