దేశంలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారిపోయాయి. ఎప్పుడు మోటార్ వాహనాలతో రద్దీగా ఉండే ప్రాంతాలు నిశ్శబ్దంగా  మారాయి.  దాంతో కొన్ని  జంతువులు, పక్షలు రోడ్లపై  తిరుగుతున్నాయి.   రోడ్లపై రద్దీగా ఉంటే బయటకు రాని నెమళ్లు, కృర జంతువులు కూడా రోడ్లపైకి రావడం జరుగుతుంది. రాత్రి సమయాల్లో మాత్రం రోడ్లపై ఏ ఒక్కరూ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో, జంతువులు, పక్షులు రోడ్లపై స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి.  తాజాగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కు ఆనుకుని ఉన్న కేబీఆర్ పార్కు వద్ద ఇటీవలే నెమళ్లు బయటకు వచ్చి కనువిందు చేశాయి.

 

తాజాగా ఓ చిరుత ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టింది. నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో కేబీఆర్ పార్కు వద్ద ఉన్న రోడ్ నంబర్ 12 ను దాటుకుంటూ వెళ్లింది.  ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.. అయితే ఆ చుట్టుపక్కల కర్మకాలి మనుషులు ఎవరైనా ఉంటే ఎంత ప్రమాదం అని భయపడిపోతున్నారు. 

 

అయితే ఇలాంటి సంఘటన ఎప్పుడు తారసపడలేదని..  రోడ్లన్నీ నిర్మాణుష్యంగా ఉండటం.. జన సంచారం లేక పోవడం వల్లనే ఈ జంతువులు బయటకు వస్తున్నాయని అంటున్నారు.  ఆ మద్య తిరుమల ఘాట్ రోడ్లపై ఎలుగు బంట్లు యేదేచ్చగా తిరిగి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. 

 

అయితే ఈ వార్తలను తెలంగాణ అటవీశాఖ ఖండించింది.  సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్న వీడియోల ఇక్కడిది కాదని, ఈ పార్క్ పరిసరాల్లో చిరుత సంచారం నిజం కాదని స్పష్టం చేసింది. కాగా, నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో కేబీఆర్ పార్కు వద్ద ఉన్న రోడ్ నంబర్ 12 ను దాటుకుంటూ చిరుత వెళ్లిదంటూ వదంతుల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: