మ‌హారాష్ట్ర‌లో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. రోజురోజుకూ పెరిగిపోతున్న కేసులు ప్ర‌జ‌ల‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  దేశంలోనే అ త్య‌ధిక క‌రోనా కేసులు మ‌హారాష్ట్ర‌లోనే నమోద‌వుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 4,666 కేసులు న‌మోద‌య్యాయి. ఒక్క ముంభై న‌గ‌రంలోనే 3000 ల‌కు పైగా కేసులు న‌మోద‌వ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  క‌రోనా బారిన ప‌డి ఇప్ప‌డి వ‌ర‌కు 232 మంది చ‌నిపోగా, 572 మంది కోలుకుని ద‌వాఖాన‌ల నుం చి డిశ్చార్జి అయ్యారు.  ఇవాళ కొత్త‌గా 466 కేసులు న‌మోద‌వడం గ‌మ‌నార్హం.

 లాక్ డౌన్ అమ‌లుతోపాటు వైర‌స్ నియంత్ర‌ణ‌కు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ చాప‌కింద నీరులా వైర‌స్ విస్త‌రిస్తుండ‌టంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలోనే  మహారాష్ట్రలో తాజాగా నెల‌కొన్న పరిస్థితులను  సమీక్షించేందుకు కేంద్ర బృందం రంగంలోకి దిగింది.  రా ష్ట్రంలో కేసులు ఎక్కువగా న‌మోద‌వుతున్న పూణె, ముంబైపై దృష్టి సారించాయి. ఈక్ర‌మంలోనే  రెండు కేంద్ర బృందాలు ఇవాళ ఆయా న‌గ‌రాల్లో ప ర్య‌టిస్తున్నాయి. క‌రోనా వ్యాప్తి, నియంత్ర‌ణ త‌దిత‌ర ప‌రిస్థితుల‌ను బృందం స‌భ్యులు స‌మీక్షిస్తున్నారు.  కాగా ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్‌ను కేంద్ర హోంశాఖ నివేదిక కోరిన సంగ‌తి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: