వ‌ర్మ‌.. సోష‌ల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటున్నారు. నిత్యం ఏదో ఒక అంశంపై ట్వీట్లు చేస్తూ అభిమానులను అల‌రిస్తూ ఉంటాడు. తాజాగా.. క‌రోనా వైర‌స్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ఓ యువ‌కుడు వీడియో సాంగ్ చేసి, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఇది తిరిగితిరిగి వ‌ర్మ కంటికి చిక్కింది. దానిని చూసి ఆశ్చ‌ర్య‌పోయాడు వ‌ర్మ‌. వెంట‌నే ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న‌దైన శైలిలో స్పందించాడు. మ‌న క్రియేటివిటీని లాక్‌డౌన్ తొక్కిపెట్ట‌లేద‌ని మీరు నిరూపించారంటూ ట్వీట్ చేశారు. నిజానికి.. మీరున్న ఇంట్లోనే జీరో బ‌డ్జెట్‌తో పెద్ద సినిమాకంటే.. చాలా బాగా వీడియో తీసారంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు.

 

అంతేగాకుండా.. మిమ్మ‌ల్ని క‌లుసుకోవాల‌ని ఉందంటూ చెప్పారు. ఇక‌.. ఏకంగా వ‌ర్మే త‌మ పాట‌ను మెచ్చుకోవ‌డంతో ఆ యువ‌కుడి ఆనందానికి అవ‌ధులులేకుండా పోయాయి. * ఈ వీడియోను నేనే కొరియోగ్రాఫ్ చేశాను. మీరు స్పందించినందుకు ఆనందంగా ఉంది. నిజంగా నాకు మాట‌లు రావ‌డం లేదు స‌ర్‌* అంటూ ధ‌న్‌రాజ్ అనే యువ‌కుడు ట్వీట్ చేశారు. ఇక వ‌ర్మ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ యువ‌కుడు మ‌రెన్ని వండ‌ర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి మ‌రి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: