భారత ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, గడచిన 24 గంటల వ్యవధిలో ఇండియాలో 1,336 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 47 మంది ఒక్క రోజులో మరణించారు. భారత్‌ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతూనే ఉన్నాయి.. ఇక, మహారాష్ట్రలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.  కరోనా తొలి మరణం వెలుగులోకి వచ్చిన తరువాత, ఇన్ని మృతులు ఒక్కరోజులో నమోదవడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ 18,600 మందికి పైగా వ్యాధి బారిన పడగా, 590 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 3,252 మంది కోలుకున్నారని చెప్పింది. ఆసుపత్రుల్లో 14,759 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది.

 

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 4,666కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 232 మంది మృతి చెందారు. 572 మంది కరోనా రోగులు కోలుకున్నారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2,081కి చేరింది. ఇప్పటివరకు ఢిల్లీలో 431 మంది కోలుకున్నారు. 47 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనా పాజిటివ్ కేసులో దేశంలో టాప్ స్పాట్‌లో ఉంది మహారాష్ట్ర.. ఇక, పుణెలోని రుబిహాల్‌ క్లినిక్‌లో పనిచేసే 25 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది.. వీరిలో 9 మంది నర్సులే ఉన్నారని చెబుతున్నారు అధికారులు. 

 

ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వెయ్యి మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించామని.. వారిలో 25 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు.  ఇక, అందరినీ ఐసోలేషన్‌లో ఉంచామని.. పాజిటివ్‌ వచ్చిన సిబ్బందికి ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నామిన వెల్లడించారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: