దేశంలో కరోనా ఎలా విస్తరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెసిందే.  మే 3 వరకు లాక్ డౌన్ పొడగించారు.  మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ మే 7 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.  ఈ సందర్భంగా ఫుడ్ సప్లై చేస్తున్న జొమాటో, సిగ్వి ఫుడ్ స్లై ఆపివేయమన్నారు. ఢిల్లీలో డెలివరీ బాయ్ కి కరోనా వైరస్ ఉండటం.. అతడు పిజ్జా సప్లై చేసిన 60 మందికి కరోనా సోకడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.అయినప్పటికీ, ఫుడ్ డెలివరీలను చేస్తున్న వారిపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝళిపించారు. 

 

కొంత మంది  జొమాటో, సిగ్వి కి చెందిన వారు చాటు మాటుగా ఫుడ్ సప్లై చేస్తున్నారు.   నిబంధనలను ధిక్కరించిన వారిని పట్టుకునేందుకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, డెలివరీ బాయ్స్ వాహనాలను వచ్చినవి వచ్చినట్టు సీజ్ చేసి, కేసులను నమోదు చేశారు. నిషేధం విధించినా, ఆర్డర్స్ తీసుకుంటున్న ఫుడ్ డెలివరీ యాప్స్ పైనా కేసులు నమోదు చేయనున్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

 

అంతేకాదు ప్రజలు కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉండాలని.. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం నేరం అని అన్నారు. లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని, వాటిని మీరితే, చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: